PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ తొలి పేరు .. భాగ్య‌న‌గ‌ర్ కాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ తొలి పేరు భాగ్య‌న‌గ‌రంగా ప‌లువురు ప్ర‌చారం చేస్తున్నార‌ని, అది పొర‌పాట‌ని ప‌లువురు చ‌రిత్రకారులు పేర్కొన్నారు. 1590లో గోల్కొండ‌లో ప్లేగు విజృంభించ‌డంతో రాజు ద‌ర్బార్ ఖాళీ చేసి.. మూసీ న‌ది ద‌క్షిణాన విడిది ఏర్పాటు చేసుకున్నార‌ని చ‌రిత్ర‌కారుడు కెప్ట‌న్ లింగాల పాండురంగారెడ్డి, పాత్రికేయుడు కింగ్ షుక్ నాగ్, రీస‌ర్చ్ స్కాల‌ర్ స‌య్య‌ద్ ఇనామూర్ ర‌హ్మాన్ ఝాయూర్ పేర్కొన్నారు. అక్క‌డ వేడి అధికంగా ఉండ‌టంతో పాటు వారు ఉన్న ప్రాంతం ఇత‌రుల‌కు క‌నిపించ‌కుండా అనేక త‌టాకాలు, తోటలు ఏర్పాటు చేయించార‌ని వివ‌రించారు. ఫ్రాన్స్ కు చెందిన ట్రావెర్నియ‌ర్ గోల్కొండ కోట సంద‌ర్శించిన‌ప్పుడు అనేక కోట‌లు ఉండ‌టం చూసి బాగ్ న‌గ‌ర్ గా (తోట‌ల న‌గ‌రం ) పుస్త‌కంలో రాశాడ‌ని తెలిపారు. ఖుతుబ్ షాహీలు త‌యారు చేసిన నాణేల పైనా భాగ్య‌న‌గ‌ర్ పేరు క‌నిపించ‌ద‌ని చెప్పారు.

                                              

About Author