NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎవ‌రితోనూ నాకు అఫైర్స్ లేవు.. స‌మంత ట్వీట్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స‌మంత‌, నాగ‌చైత‌న్య దాంప‌త్య జీవ‌నానికి ముగింపు ప‌లికిన‌ట్టు ప్రక‌టించ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా రూమ‌ర్స్ విస్త్రతంగా వ్యాప్తి చెందాయి. ఈ నేప‌థ్యంలో స‌మంత వివ‌ర‌ణ‌తో కూడిన ట్వీట్ చేసింది. నా పై మీరు చూపిస్తున్న సానుభూతికి కృత‌జ్ఞత‌లు. అయితే.. కొంద‌రు న‌న్ను వ్యక్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నారు. రూమ‌ర్స్ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎపైర్స్ ఉన్నాయ‌ని.. పిల్లలు వ‌ద్దనుకున్నాన‌ని.. అబార్షన్ చేయించుకున్నాన‌ని.. నేను అవ‌కాశ‌వాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవ‌డం ఎంతో బాధ‌తో కూడుకున్నది. న‌న్ను ఒంట‌రిగా వ‌దిలేయండి. వ్యక్తిగ‌తంగా నా పై దాడి చేయ‌డం దారుణం. మీర‌నుకునే విధంగా నేను చేయ‌ను. మీరు ఎంత బాధ‌పెట్టినా నేను చెద‌ర‌ను అని స‌మంత ట్వీట్ చేసింది.

About Author