నా తల్లిని బాధపెట్టిన వారిని వదిలిపెట్టను : లోకేష్
1 min readపల్లెవెలుగువెబ్ : తన తల్లిని విమర్శించడం బాదేసిందని, తన తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టమని నారాలోకేష్ హెచ్చరించారు. మంగళగిరి పర్యటనలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల్ని ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా ? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.