PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇల్ల‌రికం వ‌స్తేనే పెళ్లి చేసుకుంటా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ హీరోయిన్ సారా అలీఖాన్ త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌నకు అమ్మే సర్వస‍్వమ‌ని, ఆమెతో ఉండటమే త‌న‌కు సంతోషంగా ఉంటుందని అన్నారు. కొన్ని విషయాల్లో త‌న‌కు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం రాదని, ఇప్పటికీ త‌న‌ తల్లి సహాయం లేకుండా మ్యాచింగ్‌ బ్యాంగిల్స్‌, దుస్తులను వేసుకోలేన‌ని తెలిపింది. `భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుంటే నేను మా అమ్మతో కలిసి జీవించగలిగే వ్యక్తినే వివాహం చేసుకుంటాను (ఇల్లరికం). నేను ఆమెను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇల్లరికాన్ని ఒప్పుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.’ అని సారా తెలిపింది.

                                        

About Author