టికెట్ ధరలు తగ్గిస్తే అవమానించినట్టా .. నానికు మంత్రి కౌంటర్
1 min read
పల్లెవెలుగువెబ్ : సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హీరో నాని చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. సినిమా థియేటర్లలో టికెట్లు, పార్కింగ్, తినుబండారాల విషయంలో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. టికెట్ ధరలు నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రజలను అవమానించినట్టా ? అని ప్రశ్నించారు. హీరో నాని వ్యాఖ్యలకు తనకు అర్థం తెలియలేదన్నారు. థియేటర్లలో తనిఖీలు లేకపోతే పరిశుభ్రత ఎలా వస్తుందని అన్నారు.