ఐకానిక్ బ్రిడ్జి వద్దు రోడ్ కం బ్యారేజ్ ముద్దు
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: రాయలసీమ ప్రజా ప్రదర్శనను విజయవంతం చేయాలని కరపత్రాలు చూపుతున్న విద్యార్థులు.రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు సీమకృష్ణ. ఓర్వకల్:-కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిలో భాగంగా సప్తనదుల సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్డు కం బ్యారేజ్ నిర్మించాలని సోమవారం రోజు రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు ఆద్వర్యంలో ప్రభుత్వ మరియు ఆదర్శ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు సీమకృష్ణ మాట్లాడుతూ కృష్ణా నదిపై తెలంగాణ రాయలసీమ ప్రాంతాన్ని కలుపుతూ జాతీయ రహదారులలో భాగంగా కృష్ణా నదిపై ఐకానిక్ తీగల బ్రిడ్జి నిర్మిస్తుందని దానికి బదులుగా రోడ్డు కం బ్యారేజ్ నిర్మించాలని వారు తెలియజేశారు.ఐకానిక్ బ్రిడ్జికి 1200 కోట్లు అయితే రోడ్డు కం బ్యారేజ్ కి 700 కోట్లు మాత్రమే అవుతుందన్నారు. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ తో సంబంధం లేకుండా రాయలసీమకు పోతిరెడ్డిపాడు, తెలుగు గంగా, ఎస్ఆర్బిసి,కెసి కెనాల్, హంద్రీనీవా,గాలేరు నగరి ప్రాజెక్టులకు హక్కుగా నీళ్లు తీసుకోవచ్చని తెలియజేశారు. రోడ్ కం బ్యారేజ్ నిర్మిస్తే తెలంగాణ, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతంకు నీళ్లు అందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతం నుండి రైతులు,విద్యార్థులు ప్రజలు జనవరి 28వ తారీఖున చలో సిద్దేశ్వరం సంగమేశ్వరం పాల్గొని రాయలసీమ ప్రజా ప్రజల విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరి నాయుడు, గోపాల్ పాల్గొన్నారు.