NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పిటీసీ’గా గెలిపించండి..అభివృద్ధి చేస్తా

1 min read

తెదేపా జడ్పిటిసి అభ్యర్థి సంపంగి హైమావతి

సున్నంపల్లి’లో వైసీపీ భూపాల్ రెడ్డి ప్రచారం..

మిడుతూరు న్యూస్ నేడు: మిడుతూరు మండల  జెడ్పిటీసీగా నన్ను గెలిపిస్తే మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి సంపంగి హైమావతి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో గురువారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జీలు వంగాల శివరామిరెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జెడ్పిటిసి అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థి చందాపురం శ్రీలక్ష్మి గెలుపుకు కృషి చేయాలని అదేవిధంగా రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సంపంగి రవీంద్రబాబు,మనోహర్ రెడ్డి,డి జయరాముడు, సర్వోత్తమ్ రెడ్డి,

చాకర్ వలి తదితరులు పాల్గొన్నారు.

సున్నంపల్లి’లో భూపాల్ రెడ్డి ప్రచారం

సున్నంపల్లి గ్రామంలో జడ్పిటిసి వైసిపి అభ్యర్థి రజియాబి మరియు చౌటుకూరు వైసీపీ   ఎంపీటీసీ అభ్యర్థి మాదిరెడ్డి భూపాల్ రెడ్డి సున్నంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి రజియాబి మరియు ఎంపీటీసీకి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి గత వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో వినోద్ రెడ్డి బాలిరెడ్డి సాదిక్ అబ్దుల్లా సుంకిరెడ్డి పెద్దమౌలా షరీఫ్ సుబ్బారెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *