NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవము

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లి లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గురువారం శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య ధ్వజ సహిత విగ్రహ ప్రతిష్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భాజా భజంత్రీలతో, వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు వేకువజామున, సుప్రభాత సేవ తో మొదలై వేద పండితులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో పుష్పాలంకరణ అలాగే ఉదయం 8 గంటల నుండి ప్రాతః కాల పూజలు, యంత్రాభిషేకములు, జపములు, అలాగే పారాయణములు, హోమములు, గర్త పూజలు, అదేవిధంగా యంత్ర స్థాపనములు, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, జ్వాలా దర్శనం, గో దర్శనం, కూష్మా డబలి, మహా పూర్ణాహుతి, కుంబాభిషేకం, వంటి పూజలను జరిగింది, అనంతరం నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహా ఆశీర్వాచనములు, తో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది, తదుపరి 12 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, కాగా ఈ కార్యక్రమంలో రామనపల్లె గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ దేవదేవులను దర్శించుకోవడం జరిగింది, అదేవిధంగా సాయంత్రం గ్రామంలో, గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాసిమా బాబు ప్రత్యేక పూజలలో పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చింత కుంట వేణుగోపాల్ రెడ్డి, దేవి రెడ్డి రమాకాంత్ రెడ్డి, మీగడ కృష్ణారెడ్డి, దేవగుడి భాస్కర్ రెడ్డి, కాల్వ కొండ రెడ్డి, తో పాటు రామనపల్లె గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author