PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోడిపందెం నిర్వహిస్తే.. కఠిన చర్యలు

1 min read

– ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ఎవరైనా కోడిపందేలు, పేకాట, తధితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని  అన్నమయ్య జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జనవరి 5 తేది జిల్లా ఎస్పీ గారు కోడిపందేలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు గురించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే స్థావరాలను గుర్తించామన్నారు. ఆ ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పోలీస్‌ నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో గతంలో కోడి పందాలలో పాల్గొన్న వారిని గుర్తించి వారు మరల కోడి పందేలలో పాల్గొనకుండా ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేసి మరలా కోడి పందేలలో, ఇతర అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకుండా కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, పేకాట, కోడి పందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలలో ఎవరైనా పాల్గొంటే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పి గారు తెలిపారు.బైండోవర్ మీరి ప్రవర్తించిన వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి చట్టపరంగా శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోడి పందాలు, పేకాట  వంటి ఇతర అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తుల ఆర్థికంగా నష్టపోతారని, తద్వారా కుటుంబ కలహాలు వస్తుంటాయని, సులభంగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు చెయ్యడానికి ఆస్కారం ఉంటుందని, వీటి వల్ల పరోక్షంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం వుంటుందని, కాబట్టి జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించుటలో ఏ చిన్న విషయంలో కూడా నిర్లక్ష్యం వహించమని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని మరోసారి జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలను హెచ్చరించారు.

About Author