ఆధార్ లీకయితే చర్యలు తప్పవు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఓటర్ల ఆధార్ వివరాలను వెల్లడిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఆధార్ నంబర్‌ను ఓటర్ కార్డుతో లింక్ చేయడానికి సమర్పించే దరఖాస్తు (6బి) హార్డ్‌కాపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ పరచకూడదని ఈసీ పేర్కొంది. ఓటర్ల లిస్ట్‌ను రివిజన్ చేసే సమయంలో ఆధార్‌ను లింక్ చేయడానికి వీలుగా ఏర్పాట్లుచేయాలని ఎన్నికల అధికారులకు ఈసీ సూచించింది. అయితే ఆధార్‌తో లింక్ చేయలేదనే కారణంతో ఓటర్ లిస్ట్ నుంచి పేర్లను తొలగించకూడదని పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ లేఖ రాసింది.