ఎన్నికలు జరిగితే.. మళ్లీ బీజేపీయే ..!
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపడతారని సీఓటర్ ఇండియా టుడే సర్వేలో తేలింది. ఎన్డీఏ సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని పేర్కొంది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితి ఉందని తెలిపింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్ పొజిషన్ లో ఉన్నారు.