ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే.. ప్రజలకేం చెబుతారు?
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న ఆర్థికశాఖ.. తమకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుప్రశ్నించారు..ఉద్యోగుల వేతనాలు సరైన సమయంలో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30 శాతం పెంచాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం కూడా పెంచలేదు. గత ప్రభుత్వ హయాంలో వారికి 50 శాతం మేర వేతనాలు పెంచారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకేం చెబుతారు? ఎంత మొత్తాన్ని జమ చేస్తున్నారు? ఎంత వెనక్కితీసుకుంటున్నారు? అనేది అర్థం కావడం లేదు. వీఆర్‌ఏ లాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా డీఏ చెల్లించలేరా?”అని బొప్పరాజు అన్నారు.