గోరంట్ల మాధవ్ తప్పు చేస్తే శిక్ష తప్పదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ హాం మంత్రి తానేటి వనిత విమర్శించారు. టీడీపీ మహిళా నేతలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. కాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ మహిళా నేత వంగళపూడి అనిత నిరసన వ్యక్తం చేశారు. మాధవ్ పైఔ చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో తనది కాదని.. ఎవరో మార్ఫింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేశామని హోంమంత్రి వనిత తెలిపారు. ఆల్ రెడీ ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని .. ఎంపీ తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయదన్నారు. మహిళలకు న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని హోమంత్రి వనిత తెలిపారు.