ఈయన ఒకసారి కటింగ్ చేయిస్తే.. రూ. 15 లక్షలు ఖర్చు !
1 min read
పల్లెవెలుగువెబ్ : బ్రునెయి సుల్తాన్ హసనల్ బొల్కియా. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డులకెక్కిన ఘనత ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగాడు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డాడు. ఒకసారి క్షౌరం చేయించుకోవడానికి ఈయన ఏకంగా రూ.15.85 లక్షలు ఖర్చుచేస్తాడంటే, ఎంతటి విలాస పురుషుడో అర్థం చేసుకోవాల్సిందే. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భవంతి ఈయన రాజప్రాసాదం. ఇందులో విలాసమైన 1700 గదులు, అధునాతనమైన సౌకర్యాలతో అడుగడుగునా కళ్లుచెదిరేలా కనిపించే ఈ ప్రాసాదం బురుజులకు బంగారు తాపడం అదనపు ఆకర్షణ.