పవన్ యాక్షన్ చేస్తే.. ఆయన ఓవర్ యాక్షన్ చేశారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వ తీరు పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. తన పై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు. ‘‘నాపై నిఘా, పవన్‌పై పగ జగనన్నకి ఎందుకు?.. భీమ్లానాయక్‌లో పవన్ అద్భుతంగా నటించారు. పవన్ యాక్షన్ చేస్తే.. మంత్రి పేర్నినాని ఓవర్ యాక్షన్ చేశారు. కొన్ని చోట్ల థియేటర్లు బంద్ చేశారు.. అరాచకాలు సృష్టించారు. అవసరం లేకపోయినా సినిమా విషయంలో సీఎం జగన్ అల్లరి పాలయ్యారు. జగన్ వైఖరితో మా పార్టీ దెబ్బతింటుంది’’ అని రఘురామ విమర్శలు సంధించారు.