ఆయన నేరస్థుడని తీర్పు వస్తే.. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని .. వైఎస్ వివేకా హత్య కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేరం చేసినట్టు న్యాయస్థానం తీర్పు ఇస్తే రాజీనామా చేస్తానని గతంలో కూడా చెప్పానని.. ఆ మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. అవినాష్ రెడ్డి నేరం చేసే మనిషి కాదన్నారు. ఆయన నేరస్థుడని న్యాయస్థానం తీర్పు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాచమల్లు మరోసారి స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ముద్దాయిని చేసే కుట్ర జరుగుతోందని ఆరునెలల ముందే చెప్పానన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం లేదన్నారు. హత్య కేసులో అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆరోపణలు అసత్యమన్నారు.