PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2024లో సీఎం గా జగన్ వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి..

1 min read

– 50 డివిజన్లో కార్పొరేటర్లు, సచివాలయం కన్వీనర్లతో ముఖ్య సమావేశం..

–  నవరత్నాలు ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చాయి..

– మేయర్ నూర్జహాన్ పెదబాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  రాష్ట్ర ముఖ్యమంత్రి   వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్  షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని  ఆదేశాల మేరకు సోమవారం స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన ఏలూరు నియోజకవర్గం లోని 50 డివిజన్ల కార్పొరేటర్లు మరియు సచివాలయ కన్వీనర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశామని మేయర్ నూర్జహాన్ అన్నారు.2014 లో జరిగిన రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టాల్లో కూరుకుపోయింది అన్నారు. తెలుగుదేశం పార్టీ హాయంలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత దిగజారి పోయిందని విమర్శించారు.రాష్ట్ర ప్రజల కష్టాలను సమస్యలను తెలుసుకోవడం కోసం 2018 సంవత్సరంలో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు.దారి పొడవునా ప్రజల సమస్యలను కష్టాలను తెలుసుకుంటూ వారు కోరుకున్నది ఏమిటో అవగాహన చేసుకున్నారన్నారు. నవరత్నాల పేరుతో ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి ఎన్నికలకు వెళ్లి 150 స్థానాలను గెలుచుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. ఆ సమయంలోఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా,సామాజికంగా ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. మహిళలు రైతులు తీవ్ర అప్పుల. భారంతో ఉన్నారనివిద్య,వైద్యం అద్వాన పరిస్థితుల్లో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చెప్పారంటే చేస్తారని భరోసా ప్రజలకు కల్పించి. విద్య,ఆరోగ్యం,సంక్షేమంపై అవసరమైన వ్యయం చేశారన్నారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమాజంలో చివరి వ్యక్తి వరకు సేవలు,సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. అమ్మ ఒడి,విద్యా దీవెన,వసతి దీవెన,0 వడ్డీ, చేయూత మొదలగు సంక్షేమ పథకాల నగల మొత్తాన్ని మహిళల ఖాతాల్లో జమ చేస్తూ 75% మహిళా సాధికారతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటించారన్నారు.ఇచ్చిన హామీలు 98% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దక్కిందన్నారు. అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు తెలియ చేస్తున్నామన్నారు.

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 2019 సంవత్సరం నుండి రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చి అత్యంత వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 2 కోట్ల 50 లక్షలు మందికి 4 లక్షల 50 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మేయర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు సరికొత్త రూపు తీసుకువచ్చారన్నారు.  వైద్యం విషయంలో 1500కు పైగా ఆరోగ్య కేంద్రాలను నిర్మించి 17 మెడికల్ కళాశాల నిర్మించిన ఏకై ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు.రాజకీయాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాలను త్రిప్పికొడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సేవలను,జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మన పార్టీపై తప్పుడు ప్రచారం చేసే వారిని ప్రజలే నిలదీసే విధంగా  ప్రజలను చైతన్యవంతులు చేయాలని కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు సచివాలయ కన్వీనర్లకు మేయర్ నూర్జహాన్ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వైయస్సార్సీపి నాయకులు ఎస్.ఎం.ఆర్ పెదబాబు,  ఎం ఆర్ డి బలరాం, డిప్యూటీ మేయర్లు గుడిదేశీ శ్రీనివాసరావు,నూక పేయి సుధీర్ బాబు,రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ళా శ్రీలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచే0 మహిబాబు,సచివాలయంలో జోన్ కన్వీనర్లు మొటమర్రి సదానందం, కార్పొరేటర్లు యార్రంశెట్టి సుమన్, తుమరాడ స్రవంతి, ఏఎంసి వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. 50 డివిజన్ల కార్పొరేటర్లు ఇన్చార్జీలు 79 సచివాలయాల కన్వీనర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.

About Author