పన్నులు చెల్లించకపోతే… ఆస్తి జప్తు చేస్తాం.. : కమిషనర్
1 min readపల్లెవెలుగువెబ్,ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్ళలో భాగంగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్,ఆర్ ఓ,ఆర్ ఐ, మార్చి నెలాఖరు బడ్జెట్ భాగంగా స్పెషల్ డ్రైవ్ గురువారం రామచంద్ర రావు పేట ఏరియాలో ఏర్పాటుచేశారు,నగరపాలక సంస్థ పరిధిలో వ్యాపార సముదాయాల మరియు ఇంటి పన్నులు కుళ్లయి పన్నుల బకాయిలను తక్షణం చెల్లించాల వలసిందిగా ఆదేశాలు జారీ చేస్తూ. లేనియెడల చట్టపరమైన చర్యలతో తాళాలు వేసి ఆస్తి జప్తు చేస్తామని హెచ్చరించారు. గతంలోనే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని పనుల బకాయిదారులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు, అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నరని అట్టి వారిని ఉపేక్షించబోమని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ తమ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు రెవెన్యూ ఆఫీసర్ కె శోభా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి గాంధీ, సచివాలయ సిబ్బంది మరియు వార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.