NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుండె ను రక్షించే పొరే శిక్షించేది అయితే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మానవ శరీరంలో ఎంతో క్లిష్టమైన ఆర్గాన్ గుండె.. ఇది కండరాలతో నిర్మింపబడి మనము పుట్టక ముందే తల్లి గర్భంలోనుండే చనిపోయే ఆఖరి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది.. దీని చుట్టూ దానికో గదిలాగా పెరికార్డియమ్ అనే ఒక పొర రక్షిస్తూ ఉంటుంది.. దీని లోపల 50 ఎంఎల్ పెరికార్డియల్ ద్రవం అనేది గుండె స్మూత్ గా కదలడానికి వీలుగా ఉంటుంది.మనకు మామూలుగా వచ్చే చాలా ఇన్ఫెక్షన్స్ లో బ్యాక్టీరియాలు వైరల్ వి చాలా ముఖ్యమైనవి అంతేకాకుండా టీబి కూడా ముఖ్యమైనది.. చాలా మటుకు మనకు వచ్చే ఇన్ఫ్లు ఎంజా లాంటి వైరల్ జబ్బులు దగ్గు జలుబు మరియు టైఫాయిడ్ లాంటి చాలా ఇన్ఫెక్షన్స్ లో ఈ పేరికార్డియమ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది.. పెరికార్డైటిస్ మయో కార్డైటిస్ అనేటివి చాలా కామన్ గా వస్తాయి.ఒకప్పుడు ఈ టీబి వల్ల పెరికార్డైటిస్ వస్తే ఇది కన్స్ట్రక్టివ్ పెరికార్డేటిస్ గా మారేది.. అంటే ఈ పెరికార్డియమ్ అనే పొరా లోపల చీము పేరుకుపోయి అదంతా గడ్డ కట్టకపోయి గట్టి పొరగా మారి గుండెను గట్టిగా పట్టేస్తుంది.. ఇక గుండెలోకి రక్తం పోవడం చాలా కష్టం అవుతుంది.. గుండెలోకి సిరల ద్వారా రక్తం పోవడం కష్టం కావడం వల్ల సిరలన్నీ ఉబ్బిపోతాయి.. అంతేకాకుండా నీరు కడుపులో చేరుతుంది కాళ్ల వాపులు వస్తాయి.. కానీ ఇంత గుండె జబ్బు ముదిరినా కానీ పేషెంట్ కు ఆయాసం ఉండదు.. రక్తం శరీరంలోని కి గుండె నుంచి రావడం తగ్గడం వలన కొంచెం నీరసం ఉంటుంది అంతే.మామూలుగా ప్రాథమిక వైద్యుల దగ్గరికి కాళ్లవాపులు కడుపు వాపు వస్తే దీనిని నెఫ్రాటిక్స్ సిండ్రోం అనే కిడ్నీ జబ్బు గాను లేదా సిర్రోసిస్ లివర్ జబ్బు అనుకుని పరీక్షలు చేస్తారు.. అని ఈ కన్స్ట్రుక్టివ్ పెరికాడైటిస్ అనేది కూడా ఒకటి ఉంది అని దీనికి ఎకో పరీక్ష ECHOCARDIOGRAM చేయించడం వలన దీనిని ఈజీగా కనుక్కోవచ్చు.. ఇప్పుడు టీబి వలన ఈ జబ్బు రావడం తగ్గింది.. కానీ మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ జబ్బు ఇప్పుడు వస్తుంది.. ఒకప్పుడు కంటే ఇటువంటి కేసులు ఇప్పుడు రావడం బాగా తగ్గిపోయాయి.. ఈ ఐదు సంవత్సరాలలో నేను ఇవి మొదటిసారిగా ఈ కేసు చూసాను.. నేను కింగ్ జార్జ్ ఆసుపత్రి వైజాగ్ లో ఉన్నప్పుడు ఇంతకుముందు కర్నూలులో కూడా ఇటువంటి కేసులు 30 వరకు ఆపరేషన్ చేయడం జరిగింది.పూజిత అనే 16 సంవత్సరముల అమ్మాయి సంగటివారిపల్లె సత్యసాయి జిల్లా అనంతపురం నుంచి ఈ జబ్బుతో ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలుకు 4/7/25న రావడం ఆమెకు 14/7/25న ఆపరేషన్ చేయడం జరిగింది.. ఈమెకు నాలుగు సంవత్సరముల నుంచి కడుపు వాపు కాళ్ల వాపు ఉండడం జరిగింది.. ఈ ఆపరేషన్ కొంత క్లిష్టమైనది.. నారింజ పండుకు తొక్క ఎలా తీస్తామో అలా హార్ట్ పైన ఉండే పొరను నిదానంగా వలచాలి.. ఇది బీటింగ్ హార్ట్ లోనే చేస్తాము.. హార్ట్ ను ఆపము.. అలా చేసేటప్పుడు ఒక్కోసారి చిన్న హోల్స్ హార్టుకు పడుతూ ఉంటాయి అప్పుడు జాగ్రత్తగా దానిని కుట్టేయాలి.. ఇది క్లిష్టమైన గాని అనుభవగ్నులైన వైద్యులు చేతిలో ఈజీగా అయిపోయే ఆపరేషన్.ఈ అమ్మాయికి కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది.. ఈమె శరీరంలో చేరుకున్న నీరు, కడుపులోనూ కాళ్లలోనూ ఉన్న నీరు అంతా నిదానంగా మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.. ఓ రెండు నెలలకు ఈమె మనం గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది.. ఈ వారంలోనే ఆ అమ్మాయి ముఖంలో చాలా మార్పు వచ్చింది ఆ అమ్మాయి ఆనందానికి అవధులే లేవు.. శరీరం తేలికగా ఉందని గాలిలో తేలిపోతున్నట్లు ఉందని అమ్మాయి ఆనందంగా చెబుతోంది.ఇకపై ఎవరికైనా కాళ్లవాపులు కడుపులో నీరు చేరుకుంటే వాళ్లకు కిడ్నీ మరియు లివరు జబ్బులలో నార్మల్ అని తెలిస్తే ఇటువంటి గుండె జబ్బు కూడా ఉంది అని ప్రాథమిక వైద్యులు తెలుసుకోవాలి.. సకాలంలో గుండె జబ్బుల డాక్టర్ల దగ్గరికి పంపిస్తే దీనికి ఆపరేషన్ ఈజీగా చేసి ఇంటికి పంపించవచ్చు..

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు.

About Author