అనాధ పిల్లల ఆధార్ కొరకు ప్రత్యేక ఆధార్ క్యాంపు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీల వెంకట శేషాద్రి గారి ఆదేశాల మేరకు ఆధార్ లేని అనాధ పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేలా చేయడానికి స్పెషల్ ఆధార్ డ్రైవ్ బంగారుపేట సచివాలయంలో నిర్వహించారు .జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సాధి కమిటీ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంగారుపేటలో నిర్వహించిన స్పెషల్ ఆధార్ డ్రైవ్ లో 70 మంది ఆధార్ లేని పిల్లలను గుర్తించడం జరిగింది. వారికి ఆధార్ కార్డు మంజూరు చేసే ప్రక్రియను నేడు ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ తాసిల్దారు రవిచంద్ర, జిల్లా సచివాలయ ఆధార్ ఇన్చార్జి శంకర్ రెడ్డి, సచివాలయం వెల్ఫేర్ సెక్రెటరీ మోనాలి, అంగన్వాడి టీచర్లు మీనాక్షి ,కౌసల్య ,ఆనందమ్మ , జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్స్ గీతావాణి ,బాలల సంరక్షణ సాధికార అధికారి దీపా, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

