వీటిని తయారు చేస్తే రూ. లక్ష జరిమానా !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తయారు చేసినా, నిల్వ ఉంచినా రూ.లక్ష జరిమానా విధించేలా రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌పై నిషేధం సరిగా అమలయ్యేలా సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపాలిటీ రీజనల్ డైరెక్టర్‌లతో కమిటీని రూపొందించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం, జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలకు కార్యచరణను రూపొందించింది. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేస్తూ పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధిస్తారు. నిబంఽధనలకు అనుగుణంగా తయారు చేసినా.. క్యారీ బ్యాగులపై రిజిస్ట్రేషన్ నెంబర్ వేయకుంటే రూ.50 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమనాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. పరిశ్రమను సీజ్ చేస్తారు.