NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ధాన్యం కొన‌క‌పోతే.. ఇండియా గేట్ వ‌ద్ద పార‌బోస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో దాదాపు 60 ల‌క్ష‌ల టన్నుల ధాన్యం ఉంద‌ని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌క‌పోతే ఇండియా గేట్ వ‌ద్ద పార‌బోస్తామ‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలు గురించి ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంతో మాట్లాడేందుకు వ‌చ్చినా స‌రైన స్పంద‌న లేద‌న్నారు. పార్ల‌మెంట్ లో ఇచ్చిన మాట ప్ర‌కారం లిఖిత పూర్వ‌క హామీ ఇస్తూ లేఖ ఇవ్వ‌క‌పోతే ధాన్యాన్ని ఇండియా గేట్ వ‌ద్ద పార‌బోస్తామ‌ని తెలిపారు. తెలంగాణ రైతుల‌ను అవ‌మానించే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు.

                            

About Author