PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాఫీ తాగితే .. ఇన్ని స‌మ‌స్యలా ?

1 min read

Close up white coffee cup with heart shape latte art on wood table at cafe.

ప‌ల్లెవెలుగు వెబ్ : ఒక క‌ప్పు కాఫీ తాగితే.. మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంద‌ని కాఫీ ఆర్డరిస్తాం. కానీ కాఫీ తాగితే ఎన్ని స‌మ‌స్యలు వ‌స్తున్నాయో ఓ అధ్యయనం వెల్లడించింది. మ‌తి మ‌రుపు, భాష మ‌ర్చిపోవ‌డం, ఆలోచ‌న విధానం మంద‌గించ‌డం లాంటి స‌మస్యలు వ‌స్తాయ‌ని ఓ అధ్యయ‌నంలో వెల్లడైంది. వైద్య బాష‌ల్లో దీన్ని ‘ డెమెన్షియా ’ గా అభివ‌ర్ణిస్తారు. రోజుకు ఆరు కప్పులు.. ఆపైన కాఫీ తాగేవారిలో డెమెన్షియా ముప్పు అధికంగా ఉంటుంద‌ని యూనివ‌ర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కుల అధ్యయనంలో తేలింది. అతిగా కాఫీ తీసుకునే వారు అనారోగ్యానికి గుర‌వుతున్నట్టు తాజా ప‌రిశోధ‌న‌లో వెల్లడైంది. ఈ వ్యాధి ప్రభావంతో రోజూ ప‌నుల‌పై ప్రభావం చూప‌డ‌మే కాకుండా.. మ‌ర‌ణానికి సైతం గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రవేత్తల అధ్యయ‌నంలో తేలింది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేద‌ని, నియంత్రణ‌లో ఉండ‌ట‌మే మంచిద‌ని డ‌బ్ల్యూహెచ్వో కూడ ప్రక‌టించింది.

About Author