PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు మీద తాగితే ఊరికే వ‌దులుతారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్పైస్‌జెట్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ కాల్చుతూ వీడియోలు పోస్టు చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బాబీ కటారియా గుర్తున్నాడా?. అతడిపై ఇప్పుడు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. రోడ్డు మధ్యలో కుర్చీలు వేసుకుని బహిరంగంగా మద్యం తాగిన కేసులో ఈ వారంట్ జారీ అయినట్టు పోలీసులు పేర్కొన్నారు. అతడిని అరెస్ట్ చేసేందుకు హర్యానాకు పోలీసు బృందాన్ని పంపినట్టు డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ సింగ్ రావత్ తెలిపారు. రోడ్డు మధ్యలో మద్యం తాగుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత అతడికి మూడు నోటీసులు పంపామని, అయినప్పటికీ ఆయన స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు చెప్పారు.

                                         

About Author