ఆమె గురించి ముందే తెలిస్తే ప్రేమించే వాడిని కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రేమిస్తున్నానంటూ సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని హీరోయిన్ నిత్యామీనన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్ నుంచి కాల్ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామీనన్ చేస్తున్న ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించాడు. ‘గతంలో నిత్యామీనన్ అంటే తనకు ఇష్టం ఉండేది. తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు’. అంటూ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్ చేయడమేంటి?నీకంత సీన్ ఉందా? అంటూ హీరోయిన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.