NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్యాన్ కి ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ ప్రజ‌లు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింద‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ అంధ‌కారాంధ్రప్రదేశ్ గా మార్చార‌ని విమ‌ర్శించారు. ఒక‌వైపు విద్యుత్ చార్జీల పెంపుతో భారం మోపుతున్నారు.. మ‌రోవైపు విద్యుత్ కొర‌త‌తో అంధ‌కారంలో ఉండాల్సిన స్థితి ఉంద‌ని అన్నారు. బొగ్గు కొర‌త ఉంద‌ని 40 రోజుల ముందు కేంద్రం హెచ్చరించిన జ‌గ‌న్ లో చ‌ల‌నం లేద‌ని అన్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థల‌కు 215 కోట్లు చెల్లించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. అవ‌స‌రమైన మేర‌కు బొగ్గు నిల్వ ఉంచుకోవాల‌ని కేంద్రం సూచించినా జ‌గ‌న్ ప్రభుత్వం పెడ‌చెవిన పెట్టింద‌ని ఆరోపించారు. ట్విట్టర్ వేదిక‌గా నారాలోకేష్ స్పందించారు.

About Author