సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: భారతదేశ ఉక్కుమనిషి, జాతీయ సమైక్యతా స్ఫూర్తి ప్రదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన కర్నూలు సెంట్రల్ లైబ్రరీలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావం మరియు సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించే లక్ష్యంతో వ్యాసరచన పోటీలను నిర్వహించడంతో పాటు పాఠశాల స్థాయి సైన్స్ క్విజ్ పరీక్షను నిర్వహించారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అదేవిధంగా విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులను, సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సామాజిక సేవకులను ప్రత్యేక అవార్డులతో ఘనంగా సత్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను, దేశ సమైక్యతా సందేశాన్ని యువతలోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్య, విజ్ఞానం, మానవతా విలువలు మరియు సామాజిక సేవలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ ఇంటర్నేషనల్ ఐదు క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పద్మాకర్, మురారి శంకరప్ప, త్రినాధ్ కుమార్, తిరుపతి సాయి, డాక్టర్ జయప్రకాష్,డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ నాయక్, గంగాధర్ రెడ్డి, తాళ్లపాక నటరాజ, కే డీజే బాబు, డాక్టర్ రమేష్, శ్రీనివాసరావు, రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


