NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌స్ట్ వారంలో.. 13 ల‌క్షల కోట్ల డ‌బ్బు ఆవిరి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఈవీ దిగ్గజం టెస్లా షేర్లు ప‌త‌నం దిశ‌గా ప‌యనిస్తున్నాయి. సుమారు 6.9 బిలియన్‌ డాలర్ల విలువైన తన పది శాతం వాటా ఎలన్‌ మస్క్‌ అమ్మేసుకున్న విషయం తెలిసిందే. ఈ మరుక్షణం నుంచే టెస్లా షేర్ల విలువలు పడిపోతూ వస్తున్నాయి. ఎలన్‌ మస్క్‌ తన ట్రస్ట్ వద్ద ఉన్న 1.2 మిలియన్ షేర్లను $1.2 బిలియన్లకు విక్రయించాడు. టెస్లాలో తన వాటాలోని షేర్లలో 10 శాతం(17 మిలియన్‌ షేర్లు) అమ్మకానికి ఉంచాలనుకుంటున్నట్లు గత శనివారం ఆయన ట్వీట్‌ పోల్‌ ద్వారా ఫాలోవర్స్‌ ఒపినీయన్‌ కోరారు. ఎక్కువ మంది ఆ పోల్‌కు సమ్మతి తెలపడంతో.. ఇప్పటివరకు 6.36 మిలియన్‌ షేర్లు అమ్మేశాడు. టెస్లా ఇంక్ షేర్లు శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 2.8 శాతం పడిపోయిన టెస్లా షేర్లు, 1,033.42 డాలర్‌ వద్ద ముగిసింది. అయితే ఎల‌న్ మ‌స్క్ స్వయంకృతాప‌రాధం వ‌ల్లే టెస్లా షేర్లలో ప‌త‌నానికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆయ‌న త‌న వాటా షేర్లను అమ్ముతున్నట్టు సోష‌ల్ మీడియాలో ప్రక‌టించినందునే… ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మ‌కాలకు దిగారు. దీంతో టెస్లా షేర్లు నేలచూపులు చూస్తున్నాయి.

About Author