PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహాల నిర్మాణంలో… నాణ్యత తప్పనిసరి..

1 min read

– హౌసింగ్ పీడీ,  ఎంపీపీ

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు:  పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళుతుందని, అందుకు సంబంధించి పేద ప్రజలందరికీ జగనన్న కాలనీలలో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ పక్కా గృహాల నిర్మాణంలో విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ప్రతి ఒక్క గృహాన్ని నాణ్యతగా నిర్మించాలని హౌసింగ్ పీడీ కృష్ణయ్య, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, శనివారం వారు మండలంలోని కనపర్తి గ్రామ పరిధిలోని గని గుంతలలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ తనిఖీ చేశారు, ఈ సందర్భంగా వారు అక్కడి కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ, జగనన్న కాలనీలలో నిర్మించే ప్రభుత్వ పక్క గృహాలలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి నాణ్యతతో పనులు చేపట్టాలని వారిని ఆదేశించారు, అంతేకాకుండా బేస్ మట్టాలకు సంబంధించి నీటితో రోజుకు రెండు మూడు సార్లు( క్యూరింగ్) నీటిని పటాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంట్రాక్టర్లకు తెలియజేశారు, అంతేకాకుండా పక్క గృహాలు వాడే మెటీరియల్ లో నాణ్యత ఉండే విధంగా చూడాలని తెలిపారు, ప్రభుత్వం  నెలలో ప్రతి శనివారం“ హౌసింగ్ డే” గా పరికిణించడం జరిగిందని దీనిని మండల అధికారులు అందరూ కూడా ఒక మహా యజ్ఞంలా భావించి జగనన్న లే అవుట్ లలో నిర్మాణంలో నిలబడిపోయిన లబ్ధిదారులను గుర్తించి, వారికి పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా, అక్కడి గృహాలు పురోగతి చెందే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు, అంతేకాకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ దీనిని స్థాయిలో ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు, అందరూ సమిష్టి కృషితో పనిచేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన తెలియజేశారు, ప్రతి శనివారం  మండల అధికారులు అందరూ కూడా , హౌసింగ్ పై సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే ప్రోగ్రెస్ సక్రమంగా లేదో, అక్కడికి సమిష్టి గా వెళ్లి అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు, అంతేకాకుండా వాటి ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని వారు అధికారులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అలీ ఖాన్, ఎంపీడీవో జాన్ వెస్లీ, ఈ ఓపిఆర్డి సురేష్ బాబు, పి ఆర్ ఏ ఈ మురళి, ట్రాన్స్కో ఏ ఈ రామలింగారెడ్డి, హౌసింగ్ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

About Author