మేయర్ రామయ్య చేతుల మీదుగా.. క్యాలెండర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య చేతుల మీదుగా పల్లెవెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్లీన్ సిటీ….గ్రీన్ సిటీ కోసం మీడియా మిత్రులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కర్నూలు నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామన్న మేయర్ రామయ్య…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో పల్లెవెలుగు దినపత్రిక ముందుందని ఈ సందర్భంగా మేయర్ పేర్కొన్నారు.