ప్రజాయాత్ర పేరిట..త్వరలో ప్రజల్లోకి చంద్రబాబు!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: 2024సార్వత్రిక ఎన్నికల ముందస్తు ప్రణాళికలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాయాత్ర పేరిట త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రకు 9ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే 2019లో తీవ్ర పరాజయం చవిచూసిన టీడీపీని తిరిగి గాడి పెట్టాలన్నా… పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నా… పాదయాత్ర ద్వారా ప్రజలతో మరోసారి మమేకం కావడమే సముచితమన్న భావనకొచ్చారు. ఇప్పటికే కరోనా ప్రభావం కారణంగా ఎక్కువ శాతం హైదరాబాద్‌కే పరిమితం కావడంతో రాష్ట్రంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులను గమనించిన చంద్రబాబు పూర్వవైభవానికి ప్రణాళిక చరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అన్ని ఎన్నికల్లో వరుస విజయాలతో తమకు తిరుగులేదన్న ధృడ సంకల్పంతో ఉంది. ఈ క్రమంలో వైసీపీని డైలమాలో పడేసేందుకు ఓవైపు చంద్రబాబు సమయాత్తమవుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం వరుస బహిరంగ సభలతో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీపై పవన్ ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు మూకుమ్మడిగా పవన్ పవనాలను తిప్పికొట్టడంలో నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనా ఓవైపు చంద్రబాబు ముందస్తు వ్యూహరచనలో ఉంచగా మరోవైపు జనసేన రోడ్ల శ్రమదానం ద్వారా రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీ రానున్న రోజుల్లో ప్రత్యర్థి పార్టీలను ఎలా నిలువరిస్తుందో వేచిచూడాల్సిందే.