గోనెగండ్లలో చలివేంద్రం ప్రారంభం: మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: వేసవి కాలంలో ఎండలు తీవ్రం కావడంతో గోనెగండ్ల మండల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజల అవసరం కొరకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు మండలకేంద్రమైన గోనెగండ్ల లో శుక్రవారం మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ పూజారి హైమావతి ,పంచాయతీ సిబ్బంది, టిడిపి పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రక్కనే ఉన్న ఆటో డ్రైవర్లకు మంచి నీటిని పంపిణీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభాకర్ నాయుడు, రహమతుల్లా, ఎన్ వి రామాంజనేయులు, బేతాల బడేసాబ్,అడ్వకేట్ చంద్రశేఖర్, రమేష్ నాయుడు, తిరుపతయ్య నాయుడు లు మాట్లాడుతూ ప్రక్క గ్రామాల నుండి ఆఫీసు మరియు సొంత పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఈ వేసవికాలంలో త్రాగునీరు చాలా ఇబ్బంది గా ఉంటుంది. వారి అవసరాన్ని గమనించి మా సర్పంచ్ హైమవతి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి పని అని, అలాగే సర్పంచ్ గారు ప్రజల అవసరాలు తెలుసుకొని ఇటువంటి పనులు ఎన్నో చేయాలని కోరుతున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో మిన్నల్లా,మదీన, దరగల మాబు, ఖాసీం వలి, అడ్వకేట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.