NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌.. టీజర్‌‌ టాక్‌

1 min read

సినిమా డెస్క్​ : వాస్తవ సంఘటనల ఆధారంగా ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీగా వరుణ్ సందేష్ – ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇందువదన’. ఎమ్‌ఎస్‌ఆర్‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయబడిన పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ని చూపించడంతో టీజర్ ప్రారంభమైంది. వాసు – ఇందు అనే పాత్రల్లో నటిస్తున్న వరుణ్ మరియు ఫర్నాజ్ ఇద్దరూ పాతకాలపు వస్త్రధారణలో కనిపిస్తారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇందులో యాక్షన్‌ని కూడా టచ్ చేశారు. చివర్లో హీరోయిన్‌ని హారర్ లుక్‌లో చూపించడంతో సినిమాపై ఆసశక్తి కలుగుతోంది. శివ కాకాని అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆసక్తికరమైన ప్రేమ కథ వెనకున్న అసలు కథేంటో తెలియాలంటే ‘ ఇందువదన ’ సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. కథ మాటలు సతీష్ ఆకేటీ అందించారు. బి. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో రఘు బాబు – అలీ – నాగినీడు – సురేఖ వాణి – ధనరాజ్ – తాగుబోతు రమేష్ – మహేష్ విట్ట – పార్వతీషం – వంశీ కృష్ణ ఆకేటి – దువ్వాసి మోహన్ – జ్యోతి – కృతిక – అంబఋషి – ‘జెర్సీ’ మోహన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

About Author