భారతదేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
1 min read
– కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: భారతదేశం బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే కమలమ్మ అన్నారు. బిజెపి చేతిలో జగన్, చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు కీలుబొమ్మలుగా మారారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాలు పథకం అమలవుతుందన్నారు.. గురువారం రాయచోటి కాంగ్రెస్ పార్టీ కోడూరు అసెంబ్లీ కన్వీనర్ ఎస్ అల్లా బకాష్ సిఎల్పి ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ శివాలయం వద్ద నుండి బంగ్లా వరకు ర్యాలీగా వచ్చి అనంతరం బంగ్లా వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ అభివృద్ది సాదించాలంటే కాంగ్రెసు పార్టీకి అధికారంలో కి రావాలన్నారు . భారత్ జోడోయాత్ర ఏడాది ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. మతసామర్ధ్యానికి మానవత్వం మనుగడకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని దీనివల్ల పేద ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని అన్నారు. 57 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎటువంటి మతసామరస్యాలు కానీ ఉండేవి కామన్నారు.2014 తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా దేశం తయారైంది అన్నారు. బిజెపి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లా స్టీల్ ప్లాంట్, దుగ్గరాజుపట్నం ఓడరేవు, పోలవరం, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఊసే లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అల్లా బకాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో భాగంగా అన్ని జిల్లాల ప్రజలు పాదయాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాంటి మోసపూరిత పార్టీలను నమ్మరని రాబోయేది కాంగ్రెస్ పార్టీ నేనని ఆయన జోష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు మన్సూర్ అలీ ఖాన్, గోశాల దేవి, శాంతయ్య, రాయచోటి కన్వీనర్ పూల భాస్కర్, పీలేరు కన్వీనర్ రెడ్డి భాష, తంబళ్లపల్లి కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి రాజంపేట కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి పుంగనూరు కన్వీనర్ రామచంద్ర, గోల్డ్ అల్లా బకాష్ ,ఎస్ ఎం డి గౌస్ ,చెన్న కృష్ణ ,ఖాదరవల్లి , మంజునాథ,ఖదీర్ ,రమణమ్మ ,మహమ్మద్ రఫీక్, దినకర్ ,నరేష్ ,మైసూరా రెడ్డి,ఫరూక్, నరేష్ దర్బార్, ఫారుక్, రఫీ, నర్సింహారెడ్డి , ఉత్తన్న , వినయ్ ,తదితరులు పాల్గొన్నారు.