PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌ఫారీల పై భార‌త్ ఘ‌న విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (51), సూర్యకుమార్ యాదవ్ (50) అజేయ అర్ధ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ మూడు పరుగులు మాత్రమే చేశాడు.

                                         

About Author