చైనా ఉత్పత్తుల పై భారత్ కీలక నిర్ణయం
1 min readపల్లెవెలుగువెబ్ : కొన్ని చైనా ఉత్పత్తుల పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రకాల చైనా ఉత్పత్తులపై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఈ డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. పొరుగు దేశాల చౌక ఉత్పత్తుల కారణంగా స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ‘ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వస్తువుల జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్, సిలికాన్ సీలెంట్, హైడ్రోఫ్లోరో కార్బన్, కాంపొనెంట్ ఆర్-32, హైడ్రోఫ్లోరో కార్బన్‌మిశ్రమాలు ఈ డ్యూటీల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.