ఇష్టారీతిలో పెంచి.. ఇప్పుడు తగ్గించమంటారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్న సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచనపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గత నవంబరులో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు స్థానిక పన్నులు తగ్గించలేదు. అలాంటి రాష్ట్రాలు ఈసారైనా స్పందించాలి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి ఎక్సైజ్ సుంకం తగ్గింపు సందర్భంగా చెప్పారు. ఈ సూచనపై తమిళనాడు ఆర్థిక మంత్రి డాక్టర్. పి త్యాగరాజన్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ ట్వీట్‌కు కౌంటర్ ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర పన్నులను ఇష్టారీతిలో పెంచి ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించుకోవాలని ఇప్పుడు చెబుతోందని కౌంటర్ ఇచ్చారు.