NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు:ఆర్డీవో

1 min read

బిఎల్ వో’లపై ఆర్డీవో వెంకట శివ ఆగ్రహం

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: ఓటర్ల మ్యాపింగ్ పై బిఎల్వోలు విధుల పట్ల  నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు డివిజనల్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు ఆర్డీవో సి.వెంకట శివ బిఎల్ఓ లను హెచ్చరించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన బిఎల్ఓ (బూత్ లెవెల్ అధికారి)లతో ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. మిడుతూరు మండలంలో ఓటర్ మ్యాపింగ్ 90 శాతం చేయాల్సి ఉండగా 60.54 శాతం మాత్రమే చేశారు.వీటిలో మండలం చాలా వెనుకబడి ఉంది. మీరేం చేస్తున్నారు విధుల పట్ల అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ అదేవిధంగా గ్రామాల వారీగా ఓటర్ మ్యాపింగ్ ఎంత పర్సంటేజ్ చేశారని వారిపై ఆర్డిఓ మండిపడ్డారు.2002 మరియు 2025 రెండు ఓటర్ సరిచూస్తూ ప్రతి ఇంటికీ వెళ్తూ ఓటర్ వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి.వ్యక్తి వేరే గ్రామాల్లో ఉంటే వారితో మాట్లాడి ఓటర్ మ్యాపింగ్ నాలుగు రోజుల్లో త్వరగా పూర్తి చేయాలని లేకపోతే నేనే ఫీల్డ్ లోకి వస్తానని బిఎల్ఓ లతో అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు రానున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని తప్పులు లేకుండా చూడాలన్నారు.వాటిలో తప్పులు దొర్లితే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు.తర్వాత మిడుతూరు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నూతన పొలం పాస్ పుస్తకాలను త్వరలో పంపిణీ చేసేందుకు రైతుల నుండి వేలిముద్రలను వేయించుటలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మీ పనితీరు బాగాలేదని ఐదుగురు విఆర్ఓ లపై ఆర్డీవో వెంకట శివ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి బి శ్రీనివాసులు,తహసిల్దార్ టి శ్రీనివాసులు,ఎలక్షన్ డీటీ మధుసూదన్,డిప్యూటీ తహసిల్దార్ శాన్వాజ్ పాల్గొన్నారు.

About Author