NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిగ్ బాస్ లోకి తీసుకోవాలంటూ రోడ్డు పై న‌టి వినూత్న నిర‌స‌న‌ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో ప్రేక్షకుల్ని అల‌రిస్తోంది. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా షోలో పాల్గొనేందుకు సినిన‌టులు ఆస‌క్తి చూపుతారు. బిగ్ బాస్ షో ఎంపిక ప్రక్రియ ఓ ప్రాసెస్ ప్రకారం జ‌రుగుతుంది. ఓటీటీలోనూ బిగ్ బాస్ షో ప్రారంభమైంది. హిందీలో క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ షోలోకి త‌న‌ను తీసుకోవాలంటూ న‌టి రాఖీసావంత్ బిగ్ బాస్ ఓటీటీ హౌస్ వ‌ద్ద ర‌చ్చ చేశారు. వినూత్నంగా నిర‌స‌న తెలియ‌జేశారు. స్పైడ‌ర్ మేన్ బ‌ట్టలు వేసుకుని, ముంబై రోడ్లపై తిరుగుతూ .. డాన్స్ వేస్తూ హ‌ల్ చ‌ల్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

About Author