ఈటల మీద విచారణ షురూ..!
1 min readపల్లెవెలుగు వెబ్: తెలంగాణ మంత్రి ఈటల రాజేంద్ర భూకబ్జా ఆరోపణల మీద విచారణ మొదలైంది. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీం పేటల్లో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. 100 ఎకరాల అసైన్డ్ భూమిని మంత్రి ఈటల రాజేంద్ర కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యమంత్రికి రైతుల ఫిర్యాదు, మంత్రి ఈటల ప్రెస్ మీట్, సీఎం విచారణకు ఆదేశం, వెంటనే రంగంలోకి విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు రావడం .. సర్వత్ర చర్చకు తెరలేపింది. ఇంత త్వరగా సొంత కేబినెట్ లోని మంత్రి మీద విచారణకు ఆదేశించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మంత్రి ఈటల మీద వచ్చిన ఆరోపణలే.. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు మీద కూడ వచ్చాయి. కానీ వారి మీద అసలు చర్యలు తీసుకోలేదు. కానీ మంత్రి ఈటల మీద ఇంత త్వరగా యాక్షన్ లోకి దిగడం టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగించొచ్చు, లేదా పార్టీ నుండి సస్పెండ్ చేయవచ్చు. కానీ ఈ విధంగా స్వయంగా కేసీఆర్ టార్గెట్ చేయడం ఏంటన్న ప్రశ్న పలువురు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.