గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకై తనిఖీలు
1 min read
విద్యాసంస్థల పరిసరా ప్రాంతాలలో యువతకు రక్షణ కల్పించాలి
అనుమానస్పద చట్ట విరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే 1972 సమాచారం అందించండి
జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు రైల్వే స్టేషన్ లో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో రైలు లోన్ తనిఖీలు నిర్వహించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా దిశానిర్దేశంలో,ఈగల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి కృష్ణ ఆదేశాలను అనుసరిస్తూ గంజాయి అక్రమ రవాణా నివారణ కొరకు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పలు రైలు లలో తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు.ఈ క్రమంలో, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఒరిస్సా వైపు నుంచి వస్తున్న రైళ్లలో ప్రత్యేక తనిఖీలను ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించినారు.ఈ తనిఖీలను ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు స్వయంగా పాల్గొన్నారు.యువతపై ఏవైనా అనుమానాస్పద వ్యక్తుల ప్రభావం లేకుండా చూడటంతోపాటు,మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువుల రవాణాపై కూడా పూర్తి నిఘా కొనసాగింది. ఈ తనిఖీల్లో ఏలూరు జీఆర్పీ ఎస్‌ఐ సైమన్, ఆర్‌ఎస్‌ఐ ఉదయ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ సూర్య చక్ర, ఆర్‌పీఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొని సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ,విద్యా సంస్థల పరిసరాలలో యువతకు భద్రత కల్పించడం, వారి భవిష్యత్తును రక్షించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ఏదైనా అనుమానాస్పద చట్ట విరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 1972 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
