NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీ హక్కుల సాధనకై జూలై 20 న చలో ఢిల్లీ..

1 min read

విజయవాడ, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్..

బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది!

లగుడు గోవిందరావు

విజయవాడ, న్యూస్ నేడు: దేశములో 50 శాతం పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు  లగుడు గోవిందరావు అన్నారు. శుక్రవారం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్, ప్రెస్ క్లబ్  వేదికగా జూలై 20న చేపట్టబోయే చలో ఢిల్లీ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశములో 50 శాతం పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన సామాజిక, ఆర్ధిక విబిన్న రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణనకు కూడా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బీసీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, బిసి మండల్ కమీషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రాదాన్యత కల్పించాలని బీసీ రైతులకు 100 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని మనవి చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థిని,విద్యార్థులుకు స్కాలరు షిప్ లు పెంచాలని, కేంద్ర బీసీ కమిషనులో ఖాళీగా ఉన్న సభ్యులను నియమించాలని స్పష్టం చేశారు. ప్రధానమైన డిమాండ్లతో జూలై 20 తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.   ఇప్పటికైనా బీసీ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాధాన్యత కల్పిస్తూ, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాదాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డి హరీష్ కుమార్, పి సాయిరామ్, జి వంశీకృష్ణ, ఈ శరత్ తదితరులు పాల్గొన్నారు.

About Author