ప్రభుత్వ స్థలాల్లో అక్రమణల పై విచారణ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ముందుకు చొచ్చుకు రావడంతో మండల కేంద్రమైన గడివేముల పాత బస్టాండ్ లో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు గంటలు తరబడి ఇబ్బందులు పడుతుండడంతో నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో మండల స్థాయి అధికారులకు అక్రమణాలపై చర్యలు తీసుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో ఆదేశించడంతో మంగళవారం నాడు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్లు పై నిర్మించబడిన అంగళ్లను మరియు ఇళ్ల నిర్మాణాలను మండల అభివృద్ధి అధికారి మల్లీశ్వరప్ప మరియు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరి రంగడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్ తదితరులు పరిశీలించారు ట్రాఫిక్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు.