NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌నిమ‌నిషి లిఫ్టు వాడితే జ‌రిమానా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో లిప్టు ప‌ని మ‌నుషులు వాడితే జ‌రిమానా విధించ‌బ‌డుతుంద‌ని బోర్డు త‌గిలించారు. దీని పై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌ని మ‌నుషులు లిప్టు వాడితే జ‌రిమానా విధించడం ఏంట‌ని పలువురు సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. పని మనిషులు వంటింట్లో పని చేయొచ్చు..? లిఫ్టుల్లో ఎక్కకూడదా..? అని ఒకరు ప్రశ్నించారు. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఇలాంటి విషయాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఈ విషయంపై స్పందించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలని వారిని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

                              

About Author