NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలాంటి వ్య‌క్తి మ‌న‌కు స్వామీజీనా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుపతిలో మతమార్పిడులు జరుగుతున్నా చిన జీయర్‌ స్పందించలేదన్నారు. హిమాలయాల్లో చలువ కల్లద్దాలు పెట్టుకొని, నూట యాభై కిలోమీటర్ల స్పీడులో కారు నడిపిన వ్యక్తి… మనకు స్వామిజీనా? అంటూ ఎద్దేవా చేశారు. పైగా జగన్‌ని కలియుగ దైవమంటూ పేర్కొనడం మరింత హాస్యాస్పదమన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్న మతమార్పిడి, దురాచాలపై ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనీదత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరగని పాపమంటూ లేదని, మూడేళ్ల జగన్‌ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, తిరుపతి పరపతి దిగజారిందని అన్నారు. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ‘సీతారామం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

                              

About Author