నారా లోకేష్ పై తప్పుడు కథనాలు సృష్టించడం తగదు
1 min read– తెదేపా ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సాక్షి మీడియా తప్పుడు కథనాలు సృష్టించడం తగదని శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం అన్నారు.దళితుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తప్పుడు కథనాలు సృష్టించి ప్రచారం చేసి దళితులను తెదేపా కు దూరం చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దళితులను నమ్మించి నట్టేట ముంచడానికి వైసిపి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు కథనాలు సృష్టించడం సిగ్గు చేటని అన్నారు.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీల తో ముఖముఖీ కార్యక్రమంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి దళితులకు చేసింది ఏమీలేదు,పొడిచింది ఏమి లేదు,పీకింది ఏమీలేదని నారా లోకేష్ ఆన్న మాటలను వక్రీకరించి సాక్షి దినపత్రిక లో ప్రసురించడం సిగ్గు చేటని అన్నారు. దళితుల ఆరాధ్య దైవం అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని పేరు మార్చి జగనన్న విదేశీ విద్య పథకం అని పెట్టడం అంబేడ్కర్ ను అవమానించడం కాదా అని ప్రశ్నించారు.వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దళితులపై దమన కాండ సాగుతుంది.డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని నేడు డాక్టర్ అచ్చెన్న హత్య లు ప్రభుత్వ హత్యలే అని అన్నారు దళితులు వైసిపి ప్రభుత్వంను నమ్మే రోజులు పోయాయని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దళితులు ఐక్యంగా తెదేపాను అధికారంలోకి తీసుకొని వస్తారని తెలిపారు.