జీతాలు తీసుకుంటే సరిపోదు..ప్రజలకు సేవలు అందించాలి
1 min read– ప్రభుత్వ అధికారులుగా బాధ్యతగా మెలగాలి
– గడపగడప కు గైర్హాజరైన అధికారులపై ఎమ్మెల్యే ఆర్థర్ ఆగ్రహం
– గడపగడప కు హాజరుకాని అధికారులపై చర్యలు తప్పవు
పల్లెవెలుగు వెబ్నం దికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఆగ్రహవ్యక్తంచేశారు. నందికొట్కూరు మున్సిపాలిటీ లో 2వ సచివాలయం పరిధిలో బుధవారం ,శుక్రవారం రెండు రోజులు గడపగడప కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరు కాలేదు. మరి కొందరు హాజరు పట్టిక లో సంతకాలు చేసి వెళ్లిపోయారు. గడపగడప కార్యక్రమంలో ప్రజలు పలు రకాల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కూలి 40 మేకలు చనిపోయిన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందలేదని ఎమ్మెల్యే కు ఒక మహిళా ఫిర్యాదు చేశారు.అయితే పశు వైద్యాధికారులు గడపగడపకు హాజరు కాలేదు. కుమ్మరి పేటలో పలువురు కాలనీ వాసులు విద్యా దీవెన, అమ్మఒడి ఎందుకు రావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన మండల విద్యాధికారి హాజరు కాలేదు.ఇలా మరికొందరు అధికారులు గడపగడప కార్యక్రమానికి హాజరు కాలేదు. మరికొందరు హాజరు రికార్డుల లో సంతకాలు చేసి వెళ్లిపోయారు.హాజరు పట్టిక పరిశీలించిన ఎమ్మెల్యే అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం చెందారు. అధికారులు గడపగడపను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియదా అని ఆగ్రహించారు. గైర్హాజరు అయిన అధికారులపైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారులు సమయ పాలన పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గడపగడప కార్యక్రమానికి సమయ పాలన పాటించని వారు విధులకు ఏ సమయానికి హాజరవుతున్నారో అర్థం అవుతుందని అసహనం వ్యక్తం చేశారు .గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రతి శాఖ అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు.హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.