PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

1 min read

– జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి,జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ఆదేశించారు.మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల, వాణిజ్య పన్నులు, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, త్రాగునీరు, గృహ నిర్మాణాలు, వ్యవసాయం, ఇరిగేషన్ అంశాలపై జిల్లా రివ్యూ కమిటీ సమావేశం జరిగింది.సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి, బి.టి.నాయుడు, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి,పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుభాష్ చంద్రబోస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాగు నీటి అంశంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ వేసవికాలం అయినందున గ్రామాల్లో ఉన్న రక్షిత నీటి పథకాలు, ఇతర నీటి పథకాలు సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, వర్షాలు బాగా పడ్డం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మూడు,నాలుగేళ్లలో తాగునీటి సమస్య చాలా తగ్గిందన్నారు.గతంతో పోలిస్తే నీటి సమస్యలు అతి తక్కువ అని మంత్రి తెలిపారు… ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు నంద్యాల పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో నంద్యాల వాటర్ స్కీం లో భాగంగా ప్యాపిలి,పోదొడ్డి , మామిళ్ళపల్లి గ్రామాలలోని కొంత భాగానికి నీటి సరఫరా కోసం 1995 లో పామిడి నుంచి ప్రారంభించిన వాటర్ స్కీమ్ 2004 సంవత్సరానికి అతి కష్టం మీద పూర్తి అయి 2019 నాటికి ఎండిపోయిందని, ఆ పథకానికి సంబంధించి ఈ ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించడంతో పాటు అదనంగా మూడు కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసి ఈరోజు డోన్ నియోజకవర్గంలో 16 గ్రామాలకు నీరు అందించడం జరుగుతోందని మంత్రి వివరించారు..అయినప్పటికీ గ్రామాల్లో ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ఎగువ భద్ర ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి (SLP )ఫైల్ చేసిందని, లిస్టు కూడా అయిందని తెలిపారు.. ఈ సమస్యను కోర్టు ద్వారా పరిష్కారం సాధించాలనుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.వర్షపు నీటి ఆధారంగా ఉన్న గాజుల దిన్నె ప్రాజెక్ట్ కు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లూయిస్ ఏర్పాటు చేసి హంద్రీ నీవా నుంచి నీటిని తీసుకున్నామని, ఇది 30,40 సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ అని మంత్రి తెలిపారు..ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా ఒక టీఎంసీ అదనంగా పెంచడం జరుగుతోందని మంత్రి తెలిపారు.. ఈ ప్రాజెక్ట్ నుంచి డోన్ కు 0.1 టీఎంసీ, ఎమ్మిగనూరు కు 0.2 టీఎంసీ , అత్యవసర పరిస్థితుల్లో కర్నూలు నగరానికి తాగునీటి అవసరాల కోసం వాడేందుకు ఉపయోగించే నీరు 1 టీఎంసీ కంటే తక్కువ అని మంత్రి తెలిపారు.. అయినప్పటికీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ప్రతిపాదించిన సి. బెలగల్ చెరువు అప్గ్రేడ్ చేయడం పై అధ్యయనం చేయాలని ఇరిగేషన్ ఎస్ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి ని మంత్రి ఆదేశించారు.వైయస్సార్ హయాంలో 3 పెద్ద ప్రాజెక్టులు అయిన హెచ్ ఎన్ ఎస్ ఎస్ జిఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.. 2004 కు ముందు ఒక ప్రాజెక్టుకు జీరో, ఒక ప్రాజెక్టుకు 17 కోట్లు, ఒక ప్రాజెక్టు ఒక 13 కోట్లు ఉన్న బడ్జెట్ను వైయస్సార్ హయాంలో హెచ్ యెన్ ఎస్ ఎస్ కు 3 వేల కోట్లకు పైగా జిఎన్ఎస్ఎస్ కు 4 వేల కోట్లకు పైగా, వెలిగొండ కు 2 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు.. ఈరోజు హెచ్ ఎన్ ఎస్ ఎస్ కు నీళ్లు పారుతున్నాయంటే వైయస్సార్ తీసుకున్న చర్యల వల్లే అని మంత్రి పేర్కొన్నారు.. ఈరోజు ఆ నీటిని చిత్తూరు జిల్లా వరకు తీసుకుపోవాలని ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయని మంత్రి తెలిపారు..రాయలసీమ మీద తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఉందని మంత్రి స్పష్టం చేశారు.. కొన్ని సాంకేతిక కారణాల వల్లే కర్నూలు లో కృష్ణా యాజమాన్య రివర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయలేదని మంత్రి సభ్యులకు సమాధానం ఇచ్చారు.Hnss కాలువ నిర్వహణ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, నిధుల కేటాయింపుకు తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఇంజనీర్ ను మంత్రి ఆదేశించారు..కోవిడ్ సమయంలో వైద్య సేవలందించిన 280 మంది డాక్టర్ లకు జీతాల అంశంపై పరిశీలిస్తున్నామని సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.సమావేశంలో చర్చించిన అన్ని అంశాల మీద చర్య తీసుకున్న నివేదికను వచ్చే సమావేశం లోపు సభ్యులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎల్ ఎల్ సి కి సంబంధించి జీరో నుంచి 250 కిలోమీటర్ల వరకు తమ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లైనింగ్ పనులు చేయడం వల్లే ఈరోజు కోడుమూరు వరకు నీటితో సస్యశ్యామలంగా ఉందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సమావేశాన్ని ప్రారంభిస్తూ, కర్నూలు జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రం లో మెరుగైన జిల్లా గా తీర్చి దిద్దే దిశగా ఈ వేదిక ఉపయోగ పడాలని, ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక ను రూపొందిస్తామని పేర్కొన్నారు.

About Author