భయంగా ఉంది.. భద్రత కల్పించండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. లేఖతో పాటు సునీత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన దృశ్యాలతో కూడిన పెన్ డ్రైవ్ ను అందించారు. డిఐజీ, డిజిపి లకు కూడ లేఖ పంపించారు. ఈ నెల 10వ తేదిన మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని, అతడు వైకాపా నాయకుడు, హత్యకేసులో అనుమానితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి అనుచరుడని లేఖలో సునీత పేర్కొన్నారు. శివశంకర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మణికంఠరెడ్డి శుభాకాంక్షలు చెబుతూ ప్లెక్సీ కూడ వేయించాడని, అతను తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని వైఎస్ సునీత పేర్కొన్నారు. ఈ రెక్కీ వెనుక ఆంతర్యం తనకు అర్థం కాలేదని, తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె లేఖలో ఎస్పీని కోరారు.