NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మా నమ్మకం నువ్వే జగన్

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో జగనన్న మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని బనగానపల్లె పట్టణంలో కొండపేట నీలి శ్రీనివాసులు సచివాలయంకన్వీనర్ గురుడ ప్రసాద్ శుక్రవారం మండల కన్వీనర్ అధ్యక్షతన మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందించిన సేవా పథకాలను వివరిస్తూ టిడిపి ప్రభుత్వంలో చేసిన పనులను వివరిస్తూ,ఐదు ప్రశ్నలతో కూడిన బుక్లెట్ నందు ప్రతి ఇంటి దగ్గర జగన్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రశ్నలకు ప్రజలతో అవును అనే విధంగా జవాబు చెప్పి ప్రతి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ నీలి శ్రీనివాసులు సచివాలయం కన్వీనర్ గరుడ ప్రసాద్ వాలంటరీ మల్లేశ్వరి గృహ సారధులు మహమ్మద్ రజిని తీర్థ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

About Author